వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పనులకు జలవనరుల శాఖ రివర్స్ టెండరింగ్ పిలిచింది. ఈ మేరకు రూ.553.13 కోట్ల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23 నుంచి బిడ్‌ల స్వీకరణ ఉంటుందని పేర్కొంది. బిడ్‌ల దాఖలుకు తుదిగడువును అక్టోబరు 9గా జలవనరుల శాఖ తెలిపింది. వచ్చే నెల 11న ఆర్థిక బిడ్, అదేరోజు రివర్స్ ఈ-ఆక‌్షన్ ప్రక్రియ చేపడతామని వెల్లడించింది.
ఇదీ చదవండి: రివర్స్ టెండరింగ్లో సీన్ రివర్స్!