ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ తవ్వకం పనులు పూర్తయ్యాయి. 18.8 కిలోమీటర్ల పొడవైన మొదటి సొరంగం పనులను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.5 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు తరలించేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రస్తుతం మొదటి టన్నెల్ ప్రాజెక్టు పనులు పూర్తి కావడం వల్ల టన్నెల్ బోరింగ్ మిషన్ విడగొట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టనున్నారు. టీబీఎం యంత్రాన్ని విడగొట్టేందుకు దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశముంది.
మరోపక్క.. రెండో సొరంగం పనులు కూడా 12కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 29 మండలాలకు తాగునీరు అందే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: