ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని వెంపరాల పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చక్రాయపాలెం శివారు-శాంతినగర్ సమీపంలో పొలాల్లోకి మేకలు కాసేందుకు వెళ్లిన కాపర్లు మృతదేహాన్ని గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఎం. శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తికి సమీపంలో పురుగుల మందు డబ్బా, చెప్పులు, కండువా పడి ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: