ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం జబ్బార్ కాలనీ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయలయ్యాయి. నాయినపల్లిలో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న సురేష్, శ్రీనాధ్లు కళాశాల నుంచి వేటపాలెం బయలుదేరారు. జబ్బార్ కాలనీ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేయిస్తున్న వ్యక్తి అరెస్టు