ఇద్దరు దొంగలను బొల్లాపల్లి టోల్‌ప్లాజ్ వద్ద.. ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జే.పంగూలూరు ఎస్సై శ్రీనివాసరావుతో కలిసి నిందితులను అరెస్ట్ చేసినట్టు మార్టూరు ఎస్సై చౌడయ్య తెలిపారు. పట్టుబడిన ఇద్దరినీ పేర్నమిట్టకు చిందిన తన్నీరు చిడితోటి మధుబాబు, అన్నవరప్పాడుకు చెందిన గాలేటి లక్ష్మినారాయణగా గుర్తించామన్నారు.
నిందితులిద్దరికీ జైల్లో పరిచయం ఏర్పడిందని.. విడుదలైన తర్వాత ముఠాగా ఏర్పడి.. పగలు, రాత్రి వేళల్లో ఆటోలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దేవాలయ హుండీలు, మోటార్లు, ఇళ్లల్లోని సామగ్రిని అపహరించారని... ఆలయాల్లోనే 700కు పైగా చోరీలకు పాల్పడిన చరిత్ర వారిదని చెప్పారు.
ఇదీ చూడండి:
చివరి దశకు చేరుకున్న పురపోరు... పోటాపోటీగా అధికార, విపక్షాల ప్రచారం