ETV Bharat / state

చీరాల బైపాస్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

author img

By

Published : Oct 16, 2021, 8:57 AM IST

Updated : Oct 16, 2021, 10:11 AM IST

accident breaking
accident breaking

08:55 October 16

గుర్తు తెలియని వాహనం ఢీ

ఘటనా స్థలంలో పడి ఉన్న నంబర్ ప్లేట్
ఘటనా స్థలంలో పడి ఉన్న నంబర్ ప్లేట్

ప్రకాశం జిల్లా చీరాల​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీరాల బైపాస్ లోని మన్నం అపార్ట్​మెంట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. 

జాతీయ రహదారి పక్కన ఇద్దరు యువకుల మృతదేహాలు పడి ఉండగా.. వారిని సాయికాలనీకి చెందిన రవిచంద్‌, మరియమ్మపేటకు చెందిన విల్సన్​గా స్థానికులు గుర్తించారు. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలంలో నంబర్ ప్లేట్.. 

ప్రమాదం జరిగిన చోట మరో వాహనానికి సంబంధించిన నంబర్ ప్లేట్ పడి ఉంది. దీంతో ప్రమాదానికి కారణం ఆ వాహనమేమోనని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదీ చదవండి: Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

Last Updated : Oct 16, 2021, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.