ETV Bharat / state

పాత కక్షలతో ఇరు వర్గాల ఘర్షణ...ముగ్గురికి గాయాలు

పాత కక్ష్యలతో ఇరువర్గాల మధ్య జరిగిన సంఘర్షణలో ముగ్గురు గాయపడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

పాత కక్ష్యలతో ఇరు వర్గాల ఘర్షణ
author img

By

Published : Sep 12, 2019, 2:40 PM IST

పాత కక్షలతో ఇరు వర్గాల ఘర్షణ
ప్రకాశం జిల్లా కురుచేడు మండలం బయ్యారం గ్రామంలో బొల్లెపల్లి శ్రీనివాసరావు, బొల్లెపల్లి ఆదినారాయణలకు ఉన్న పాత కక్షలతో ఘర్షణ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు దాడికి దిగటంతో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురు గాయపడ్డారు. ఘర్షణలో గాయపడినవారిని గ్రామస్థులు దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మోహన్​రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసరావు వేరేవాళ్లకు అమ్మిన పొలంలో ఆదినారాయణ గడ్డి పెంచడమే వివాదానికి దారి తీసిందని తెలిపారు. ఈ విషయంపై మాలెంపాటి ఆంజనేయులనే వ్యక్తి కుమారుడుపై ఫిర్యాదు చేశారని... ఆయన ఫీల్డ్​ అసిస్టెంట్ ఉద్యోగం పోయిందని వివరించారు. దీన్ని మనసులో పెట్టుకొని శ్రీనివాసురావుపై దాడి చేశారని చెప్పారు. ఘర్షణలో పాల్గొన్న శ్రీనివాసరావును, ఎసయ్యను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి : బకాయిలు చెల్లించాలంటూ పశుసఖిల ధర్నా

Intro:ap_tpt_51_12_mrutyuvuto_poraatam_bidda_aakali_teerche_aaratam_pkg_avb_ap10105

ఏనుగుల దాడులతో బెదురుతున్న రైతన్న ఓవైపు.... ఏనుగు దాడిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా బిడ్డ ఆకలి తీర్చే ఓ గోమాత ఆరాటం మరోవైపు...
* చిత్తూరు జిల్లాలో కన్నీళ్లు పెట్టిస్తున్న రైతుల అవస్థలుBody:*ఏనుగుల దాడులతో నిండా మునుగుతున్న రైతన్న*

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో అధికభాగం కౌండిన్య అడవులు వ్యాపించి ఉన్నాయి. ఈ అడవులలో ఏనుగులు బృందాలు బృందాలుగా విడిపోయి నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో అటవీ సమీప ప్రాంతాల గ్రామాలపై దాడి చేస్తూ రైతన్నలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇదేవిధంగా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గాంధీనగర్ అటవీ ప్రాంతంలో సుమారు 15 రోజుల నుంచి ఏనుగుల మంద రైతులను హడలెత్తిస్తున్నాయి. ప్రతిరోజు పంట పొలాలపై దాడులు చేస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. అయితే ఇది 15 రోజుల నుంచి మాత్రమే కాదని గత మూడు దశాబ్దాలుగా తన ప్రాంతంలో పంట పొలాలు ఖండించి బాగుపడిన రైతు ఒక్కరు లేరని, మూడు దశాబ్దాల క్రితం పచ్చని పంట పొలాలతో అలలాడే తమ ప్రాంతంలోని వ్యవసాయ భూములన్నీ ఏనుగుల దెబ్బలతో నేడు బీడు భూములుగా మిగిలాయని చాలామంది నష్టాలు భరించలేక నగరాలకు వలస వెళ్లిపోయారని ప్రస్తుతం ఉన్న తాము వ్యవసాయం మానివేసి పశువులను మేపుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగించే పరిస్థితి ఉందని అక్కడి రైతులు పేర్కొంటున్నారు అయితే తాజాగా ఏనుగులు పశువుల పై కూడా దాడి చేసి వాటి ప్రాణాలు తీస్తుండడంతో ఎలా బతకాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నామనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే ఓ లేగ దూడను చంపేసిన ఏనుగులు, ఓ ఆవు వెన్నుపూస ను విరగ్గొట్టాయని, దీంతో గత 11 రోజులుగా ఆ ఆవు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోందంటూ రైతులు వాపోతున్నారు.

*ఓవైపు మృత్యువుతో పోరాటం మరోవైపు బిడ్డ ఆకలి తీర్చే ఆరాటం*

కాగా ఏనుగుల దాడిలో వెన్నుపూస విరిగి లేవలేని స్థితిలో చావు బతుకుల మధ్య మృత్యువుతో పోరాటం చేస్తున్న ఆవు తన బిడ్డ ఆకలి తీర్చేందుకు పడుతున్న ఆరాటం చూస్తే కన్నీళ్లు ఆగవు. ఏనుగుల దాడులకు సరిగ్గా 11 రోజుల క్రితం దూడను ప్రసవించిన ఆవు వెన్నుపూస విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ 11 రోజులుగా సరైన మేత లేక పోయినా తన బిడ్డ ఆకలితో పొదుగు దగ్గరకు వచ్చేటప్పటికి తన ఒంట్లోని శక్తి నంతా పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీరుస్తోంది ఈ దృశ్యాలను చూస్తూ గ్రామస్తులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దూడ సైతం తన తల్లిని వదిలి ఎక్కడికి వెళ్లేది లేదంటూ ఆవు పక్కనే ఉంటూ నీరసంగా కాలం వెళ్లబుచుతోంది.

*చావే శరణ్యం*

ఏనుగుల దాడుల నుంచి తమను తమ పంటపొలాలను తమ పశువులను కాపాడాలని ఏనుగులు పూర్తిగా తమ గ్రామం వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని గాంధీనగర్ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు వ్యవసాయం ఒకటే తెలుసని మరే పని తెలియదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక చావే శరణ్యమని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బైట్ 1: కృష్ణమూర్తి, పాడిరైతు
బైట్ 2: వసరాయప్ప, గ్రామస్తుడు, గాంధీనగర్
బైట్ 3: తులసి కుమార్, రైతు, గాంధీ నగర్.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491

నోట్: సర్.. ఈ కథనం నిన్న కూడా పంపాను. మంచి మానవాసక్తి కథనం.. మరో సారి పరిశీలించగలరు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.