ETV Bharat / business

పెళ్లి కోసం అప్పు - లాభమా? నష్టమా? ఆర్థిక నిపుణుల మాటేంటి? - Wedding With Personal Loan

Wedding With Personal Loan : భారతదేశంలో పెళ్లిళ్లు ఎంత వైభవంగా జరుపుకుంటారో మనందరికీ తెలిసిందే. అయితే చాలా మంది ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం కోసం అప్పులు చేస్తుంటారు. మరి ఇలా చేయడం మంచిదేనా?

Indian Marriage
Hindu Marriage (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2024, 5:07 PM IST

Wedding With Personal Loan : భారతదేశంలో పెళ్లిళ్లు అంగరంగ వైభోగంగా జరుపుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. మరి మీరు కూడా ఈ సీజన్‌లో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారా? ఇందుకోసం అప్పు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే.

భారతదేశంలో ఏ బ్యాంకు కూడా వివాహం కోసం ప్రత్యేకంగా రుణాలు ఇవ్వడం లేదు. ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే అధిక వడ్డీ రేటుకు అప్పులు ఇస్తుంటారు. కానీ ఇది తలకు మించిన భారంగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాస్తవానికి వ్యక్తిగత రుణాలను అసురక్షిత రుణాలుగా భావిస్తుంటారు. అందుకే వీటిపై బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తుంటాయి. ప్రస్తుతానికి చాలా బ్యాంకులు పర్సనల్‌ లోన్స్‌పై 11 శాతం నుంచి 16 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.

పెళ్లి కోసం అప్పులు చేయవచ్చా?
పెళ్లి కోసం అప్పులు చేయడం సహజమే. అయితే వ్యక్తిగత రుణాలు తీసుకుని వివాహం చేసుకోవడం లేదా చేయడం మంచిది కాదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మరే అవకాశం లేనప్పుడు మాత్రమే, చివరి ప్రయత్నంగా వ్యక్తిగత రుణాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరేమి చేయాలి?
మహిళలైనా, పురుషులైనా సంపాదన ప్రారంభించిన తరువాత, ముందుగా తమ పెళ్లి కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవడం మంచిది. మహిళలు బంగారం కొనుక్కోవడం లేదా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మదుపు చేయడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లాంటివి చేయవచ్చు. పురుషులు లార్జ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిస్క్ తీసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేకపోతే, మంచి వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్‌, రికరింగ్ డిపాజిట్లలో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. అప్పుడే పెళ్లి సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి.

ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు - ఇప్పుడు ఏం చేయాలి?
ప్రస్తుతానికి చేతిలో డబ్బు లేదు, కానీ అత్యవసరంగా పెళ్లికి డబ్బులు కావాలి, మరే ఇతర మార్గాలు లేవు అనుకున్నవారు వ్యక్తిగత రుణాలు తీసుకోకతప్పదు. కానీ పర్సనల్ లోన్‌ తీసుకునే వాళ్లు 5 కీలకమైన విషయాలు గుర్తుంచుకోవాలి. అవి:

1. వడ్డీ రేట్లు : మిగతా లోన్స్‌తో పోల్చిచూస్తే, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికి చాలా బ్యాంకులు 11 శాతం నుంచి 16 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.

2. ప్రత్యామ్నాయాలు : వ్యక్తిగత రుణాలకు బదులుగా ప్రత్యామ్నాయాలు గురించి ఆలోచించాలి. ఉదాహరణకు - మీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై లోన్ తీసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే వీటిపై వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉంటుంది.

3. ప్రీపేమెంట్‌ : మీరు పర్సనల్‌ లోన్ తీసుకున్న తరువాత దానిని వీలైనంత త్వరగా చెల్లించే ప్రయత్నం చేయాలి. అయితే చాలా బ్యాంకులు ప్రీపేమెంట్ చేసేటప్పుడు, అందుకు అదనపు రుసుములను వసూలు చేస్తాయి. పైగా మీరు బకాయి ఉన్న మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. చాలా బ్యాంకులు మీరు రుణం తీసుకున్న 12 నెలలలోపు ప్రీపేమెంట్ చేయడానికి ఒప్పుకోవు.

4. వీలైనంత తక్కువగా : పెళ్లి కోసం పర్సనల్ తీసుకునే బదులు, మీరు అప్పటి వరకు చేసుకున్న పొదుపు డబ్బులు, మీరు పెట్టిన పెట్టుబడులను ఉపయోగించాలి. ఇవి కూడా చాలనప్పుడు మాత్రమే, అవసరం మేరకు తక్కువ మొత్తంలో రుణాలు తీసుకోవాలి.

5. బడ్జెట్‌లో పెళ్లి : భారతదేశంలో చాలా మంది తమ పెళ్లి కోసం స్థాయికి మించి ఖర్చు చేస్తుంటారు. తరువాత అప్పుల పాలై లబోదిబోమంటూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. వీలైనంత తక్కువ బడ్జెట్లో పెళ్లి చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్‌లో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి.

పర్సనల్ లోన్​ తిరిగి చెల్లించలేదా? డిఫాల్టర్లకు జరిగే నష్టాలివే! - What Happens To Loan Defaulters

2నెలల్లో 48లక్షల పెళ్లిళ్లు- రూ.6లక్షల కోట్ల బిజినెస్- భారత్​లో అలా ఉంటది మరి! - Indian Wedding Season Business 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.