Pushpa 2 Fahadh Faasil Remuneration : పుష్ప 2 : ది రూల్ సినిమా కోసం టాలీవుడ్ సినీ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. మొదటి భాగం భారీ హిట్ కావడం వల్ల ఈ రెండో భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన ఎంత పారితోషికం అందుకుంటున్నారో తాజాగా వివరాలు చక్కర్లు కొడుతున్నాయి.
మెయిల్ విలన్ ఆయనే - పుష్ప చిత్రంలో ఎస్‍పీ భన్వర్ సింగ్ షెకావత్‍గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటించారు. ఈ మూవీ సెకండాఫ్ చివర్లో వచ్చిన ఆయన పాత్ర (పోలీస్ కమ్ విలన్) బాగా పాపులర్ అయింది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర అదిరిపోయింది.
రెమ్యూనరేషన్ ఎంతంటే? - పుష్ప కోసం ఫహాద్ ఫాజిల్ దాదాపు రూ.3.5 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను అందుకున్నారట. ఈ సినిమాలో ఆయన పాత్ర హైలైట్ అవ్వడంతో పాటు ప్రస్తుతం సినీ మార్కెట్లోనూ తన క్రేజ్ బాగా పెరగడంతో రెమ్యునరేషన్‌ను పెంచేశారు ఫహాద్ ఫాజిల్. పైగా పుష్ప 2లో ఫుల్ లెంగ్త్ రోల్ కూడా. అందుకే పుష్ప 2 సినిమా కోసం ఫాహద్ ఫాజిల్ ఏకంగా రూ.7.2 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. అంటే పుష్ప తొలి భాగంతో పోలిస్తే రెండో భాగం కోసం దాదాపు రెట్టింపుగా తీసుకున్నారు.
కాగా, ఈ ఏడాది మలయాళంలో ఆవేశం చిత్రంతో ఫహాద్ ఫాజిల్ భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. మరోవైపు తెలుగు, తమిళం చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రజనీ కాంత్‌తో కలిసి నటించిన వేట్టాయన్ అక్టోబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇకపోతే మలయాళంలో హీరోగా ప్రస్తుతం మరో రెండు చిత్రాలను చేస్తున్నారు ఫహాద్. తెలుగులో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్ చిత్రాలు కూడా లైనప్‌లో పెట్టారు.
'పుష్ప' విలన్‌కు అంత రెమ్యూనరేషనా? షూటింగ్ క్యాన్సిలైతే ఫైన్ కూడా! - Fahadh Faasil Remuneration