ETV Bharat / state

ముగ్గురు చిన్నారులకు వైకల్యం.. ఎవరిస్తారు ఆపన్నహస్తం? - PRAKASHAM DISTRICT

అధికారులూ.. మాపై దయ చూపరా! అంటూ ఓ తల్లి దీనంగా వేడుకుంటోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు పిల్లలు వైకల్యం బారిన పడిన పరిస్థితుల్లో.. ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

శాపంగా మారిన అంగవైకల్యం..ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
author img

By

Published : Jul 5, 2019, 9:47 AM IST

శాపంగా మారిన అంగవైకల్యం..ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

ప్రకాశంజిల్లా శ్రీరాంపురానికి చెందిన ఏడుకొండలు, లక్ష్మీదేవికి ఇరవై సంవత్సరాల క్రితం మేనరికపు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. మొదటి సంతానం భాగ్యలక్ష్మికి పుట్టిన కొన్ని రోజులకే పోలియో సోకింది. రెండవ సంతానంగా పుట్టిన ఆడపిల్లకూ అదే పరిస్థితి ఏర్పడింది. మూడో సంతానంగా పుట్టిన కుమారుడి పరిస్థితీ అంతే. ముగ్గురికి ముగ్గురు వైకల్యంతో ఉండడాన్ని తట్టుకోలేకపోయిన ఆ తండ్రి ఏడుకొండలు.. తీవ్ర మనోవేదనతో అనారోగ్యం బారిన పడ్డాడు.

మేనరికమే... సమస్యకు కారణమని వైద్యులు తేల్చి చెప్పారని బాధిత దంపతులు చెబుతున్నారు. తండ్రి సంపాదనతోనే కుటుంబం జీవనం సాగించాల్సిన పరిస్థుతుల్లో... ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ముగ్గురు పిల్లలకు పింఛన్ల కోసం అధికారులచుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగితే ఒక్కరికి అవకాశం కల్పించారు. మిగిలిన ఇద్దరికి పింఛన్ భరోసా కల్పిస్తే మేలుచేసిన వాళ్ళు అవుతారని అధికారులను ఏడుకొండలు వేడుకుంటున్నాడు.

ఇవీ చూడండి-విత్తన వ్యథలు... అన్నదాతల తోపులాట

Intro:తలనీలాల విక్రయం ద్వారా తిరుమల శ్రీవారికి భారీ ఆదాయం వచ్చింది. భక్తులు సమర్పించిన తలనీలాలకు తితిదే ఈ-వేలం నిర్వహించింది. వేలంలో 76 వేల 500 కిలోల కురులు అమ్ముడుపోగా.... 6.10 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు తితిదే ప్రకటించింది. యాత్రికులు స్వామివారికి సమర్పించిన తలనీలాలకు నెలకోసారి తితిదే ఈ వేలం నిర్వహిస్తోంది. వివిధ రకాలుగా తలనీలాలను విభజించి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో విధానం ద్వారా విక్రయిస్తుండడంతో స్వామివారికి భారీగా ఆదాయం సమకూరుతోంది.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.