ప్రకాశం జిల్లా పరిధిలోని ఆలయాల్లో దర్శనాల పున:ప్రారంభానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సింగరకొండ...
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అధికారులు దర్శనాల నిమిత్తం ట్రయల్ రన్ నిర్వహించారు. 10వ తేదీన భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. నేటి ట్రయల్ రన్‌కు కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి,ఆలయ వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తప్పకుండా మాస్కులు ధరించాలని.. గుర్తింపు కార్డులు తీసుకురావాలని సూచించారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఆలయానికి రావొద్దని తెలిపారు. అంతర ఆలయ దర్శనం, ఆకు పూజ వంటివి కొన్ని రోజులు నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు మాస్కులు ధరించేలా, చేతులు శానిటైజ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని ఆలయ నిర్వహకులు తెలిపారు.
త్రిపురంతాకం..
త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీ దేవి ఆలయాలలో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ తరువాత... ఆలయ సిబ్బందికి , స్థానికులకు దైవ దర్శనం కల్పించారు.
ఇదీ చూడండి: