రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. మంత్రివర్గ సమావేశంలో అగ్ర వర్ణాలలో పేద కుటుంబాలకు ఈబీసీ నేస్తం పథకం క్రింద ఏడాదికి రూ.15 వేల చొప్పున ప్రకటించడంపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పద్మజ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తెదేపా పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పథకాలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ అధికారులపైన ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: