ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని, ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్ధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.