ETV Bharat / state

తిరుమల భక్తులకు గుడ్​న్యూస్​ - కావాల్సినన్ని లడ్డూలు - ఎప్పటినుంచో తెలుసా?

శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం - పోటు సిబ్బంది నియామకానికి చర్యలు

Tirumala Laddu Prasadam
Tirumala Laddu Prasadam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 10 hours ago

TTD Key Decision on Tirumala Laddu Prasadam: తిరుపతి దర్శనమంటే భక్తులకు అదొక మధురానుభూతి. భక్తులు శ్రీవారిని ఎంత భక్తితో పూజిస్తారో స్వామి ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తారు. శ్రీవారి నివేదనలకు ఎన్నో రకాల ప్రసాదాలు తయారవుతున్నా లడ్డూలకు మాత్రం ప్రత్యేక ఆదరణ ఉంది. అందుకే తిరుపతి వచ్చిన భక్తులు వెంకన్నని చూశాక ఎంత ఆనందిస్తారో శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతారు. ఎందుకంటే ఆ రుచి వేరు అంతే. ఎవరైనా తిరుమల వెళ్లొచ్చాం అని చెప్పగానే దర్శనం ఎలా జరిగింది అని అడగకుండా లడ్డూ ఏది అని అడుగుతారు. మరి భక్తులకు అంతలా చేరువైంది ఈ లడ్డూ ప్రసాదం.

ప్రస్తుతం శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూలు పరిమితి ప్రకారం ఇచ్చేవారు. దీంతో లడ్డూలు ఎక్కువ తీసుకోవాలనే వారికి నిరాశే ఎదురయ్యేది. ఈ పరిస్థితిని మార్చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బందిని నియమించడానిక సిద్ధమవుతోంది. దేవస్థానంలో ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6000 పెద్ద లడ్డూలు (కల్యాణం లడ్డూ), 3,500 వడలు తయారవుతున్నాయి.

కొత్త శోభ సంతరించుకున్న తిరుగిరులు - కనువిందు చేస్తున్న కపిలతీర్థం జలపాతం

తిరుపతిలోని స్థానిక ఆలయాలతో పాటు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఆలయాలలో స్వామివారి ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. సాధారణ దర్శనం చేసుకున్న వారికి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు సుమారు 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ లెక్కన ఉచిత లడ్డూలే 70 వేలు ఇవ్వాల్సి వస్తుంది. ఇవి కాకుండా భక్తులు తమ బంధువులు, చుట్టుపక్కల ఉండే వారికి ప్రసాదాన్ని ఇచ్చేందుకు అదనంగా మరికొన్ని లడ్డూలు కొనుగోలు చేస్తుంటారు.

ప్రత్యేక రోజుల్లో శ్రీవారి లడ్డూలకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. అయితే సాధారణ రోజుల్లో లడ్డూల విషయంలో ఇబ్బందులు లేకున్నా వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో డిమాండ్‌ బాగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 50 వేల చిన్న లడ్డూలు, 4000 పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీవైష్ణవులతోపాటు మరో 10 మంది శ్రీవైష్ణవులు కానివారిని నియమించనున్నారు. ఒక్కసారి సిబ్బంది నియామకం పూర్తైన తర్వాత భక్తులు అడిగనన్ని లడ్డూలు లభించనున్నాయి.

రెండు గంటల్లో తిరుమల దర్శనం ఎలా? - మళ్లీ ఆ విధానం తీసుకురానున్నారా!

టీటీడీలో మార్పులకు శ్రీకారం - తిరుపతి వాసులకు దర్శన కోటా పునరుద్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.