విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలక దశ. మార్చి 23 నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా విద్యార్ధులు సాధన చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 3వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నవంబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గణిత శాస్త్రం, సామాన్యశాస్త్రం, ఆంగ్లం వంటి సబ్జెక్టుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఆదివారాల్లో సైతం ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్ధులను తీర్చిదిద్దుతున్నారు. మంచి మార్కులు సాధించేందుకు కావలసిన సాధన చేయిస్తున్నారు. ప్రత్యేక తరగతులతో చాలా ఉపయోగం ఉందని, అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటున్నామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...