ప్రకాశం జిల్లా సంతనూతలపాడు శాసనసభ్యుడు సుధాకర్‌బాబు పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత జరిగింది. నాగులుప్పలపాడు మండలం ఉప్పుకుండూరులో ఎమ్మెల్యే పర్యటిస్తుండగా... తాము ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రావాలంటూ వైకాపా నేతలు నాగేశ్వరరావు, మాదాసి రాంబాబు వర్గీయులు ఒకరినొకరు తోసుకుంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితుల్లో పోలీసులు గొడవను చక్కదిద్దారు.
మరోవైపు కరోనా ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ఇలా ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా సమంజసం కాదని, భౌతిక దూరం పాటించక పోవడం వల్ల వైరస్ వ్యాప్తికి ఆస్కారం ఇచ్చినట్లువుతుందని పలువురు స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి:
యూపీలో ఘటన: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలు కొవ్వొత్తుల ర్యాలీ