ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ డిపో వెనుక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మార్కాపురం డిపోలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న... వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అనారోగ్య కారణంతో... తెల్లవారుజామున ఉరివేసుకుని చనిపోయాడు. 30 ఏళ్ల నుంచి ఎలక్ట్రిషయన్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లుకు... ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మరో ఆరేళ్లుంటే పదవి విరమణ పొందేవారని... ఆత్మహత్య చేసుకోవటం బాధకరమని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
ఎస్పీ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం... కారణం ఇదే!