రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టినరోజు సందర్బంగా ప్రకాశం జిల్లా చీరాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. పేరాల శ్రీనివాసనగర్‌లోని అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మామిడి మొక్క నాటి.. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు పండ్ల మొక్కలు అందజేశారు.
నోబెల్ స్కూల్, వాసవి స్కూల్, విజ్ఞాన భారతి స్కూల్, సాల్మన్ హాస్పిటల్లో సంస్థ ప్రతినిధులు మొక్కలు నాటారు. జామ, సపోటా, నిమ్మ, బత్తాయి, ఉసిరి పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి బతికుండగానే శ్మశానానికి!