ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది .దీంతో గిద్దలూరు పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. వ్యాపారస్తులకు, పాఠశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఈ మధ్యకాలంలో ఇటువంటి భారీ వర్షం పడడం ఇదే మొదటిసారి. గిద్దలూరులో ప్రధానంగా ఉన్నటువంటి తాగునీటి సమస్య తీరుతుందని ప్రజల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి.లింగాల కుడికాలువకు కృష్ణా నీరు విడుదల