ప్రకాశం జిల్లాలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలివిడత ఎన్నికల హడావుడి జోరందుకుంది. పోటీకి బరిలో నిలిచే అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇక రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది.
రెండో విడత 14 మండలాల్లో 277 పంచాయతీలు, 2760 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి రెండు రోజులు మందకొడిగా నామినేషన్లు వేసినా.. మూడో రోజు పోటాపోటీగా దాఖలు చేశారు. మండ్లమూరు, మర్రిపూడి వంటి ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు నామినేషన్లు వేసేందుకు వరుసలు కట్టారు.
రెండోవిడతలో మొత్తం 1625 మంది సర్పంచులు, 5966 మంది వార్డు సభ్యులు నామినేషన్లు వేశారు. అత్యధికంగా సర్పంచి పదవులకు దర్శి మండలంలో 149 మంది, కొనకొనమెట్ల మండలంలో 154, అద్దంకి మండలంలో 166 నామినేషన్లు వేశారు.
ఇదీ చదవండి: