ETV Bharat / state

ఫోన్​ కొట్టు.. పరిష్కారం పట్టు.. మార్టురు పోలీసుల వినూత్న ఏర్పాట్లు

author img

By

Published : Jun 18, 2020, 12:01 PM IST

Updated : Jun 18, 2020, 7:40 PM IST

రోజు రోజుకు కరోనా విజృంభిస్తున్న కారణంగా ప్రకాశం జిల్లా మార్టురు పోలీసులు ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిన్న చిన్న సమస్యలకు తమ వద్దకు రావాల్సిన అవసరం లేదని, తనకు ఫోన్​ చేస్తే సిబ్బందే మీ దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. ఇంకా స్టేషన్​కు వచ్చే వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు మార్టురు ఎస్సై శివకుమార్​ తెలిపారు.

police-special-arrangements-for-victims
మార్టురు పోలీసులు ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

'మీ ఇంటికే వస్తాం... మీ సమస్యలు తీరుస్తాం...' అని ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్.ఐ శివకుమార్ చెపుతున్నారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న కారణంగా మార్టూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. టెంట్లు వేసి భౌతిక దూరం పాటించేలా కుర్చీలు వేసి ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్ పెట్టారు. ఫిర్యాదు దారులు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు తమ సమస్యలు చెప్పుకునే వీలు కల్పించారు. లాక్​డౌన్ సడలింపులు తరువాత కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయని మండల ప్రజల అత్యవసర ఫిర్యాదుల కోసం స్టేషన్ వద్ద ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్నచిన్న సమస్యలకు పోలీస్​స్టేషన్​కు రావాల్సిన అవసరం లేదని తన ఫోన్ నెంబర్ 9121102151 కు ఫోన్ చేస్తే సిబ్బంది మీఇంటి వద్దకే వచ్చి సమస్యను పరిష్కరిస్తామని మార్టూరు ఎస్.ఐ శివకుమార్ భరోసానిస్తున్నారు.

ఇవీ చూడండి... ఇనుప కంచెలో ఇరుక్కున్న గోవు... కాపాడిన స్థానికులు

Last Updated : Jun 18, 2020, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.