ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థకౌశల్ ఆదేశాల మేరకు... ఒంగోలులో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఒకటొ పట్టణ సీఐ భీమానాయక్ పాత నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పట్టణ పరిధిలో 94 మంది రౌడీ షీటర్లు ఉండగా... 33 మంది బయట ఉండి... ఈ కౌన్సిలింగ్‌కి హాజరుకాలేదని పోలీసులు తెలిపారు. కి వచ్చిన పాత నేరస్థుల పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
ఎక్కడ నివాసం ఉంటున్నారు... ఏం పని చేసి జీవిస్తున్నారో కనుక్కున్నారు. నగరంలో ఎక్కడైనా పాత నేరస్థులు ఇబ్బంది పెడుతుంటే తమ దృష్టికి తేవాలని సీఐ విజ్ఞప్తి చేశారు. రౌడీషీటర్లు అందరితో కలసిపోయి... మంచిగా జీవనం సాగిస్తున్నా తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి రౌడీషీట్ ఎత్తివేశాలా కృషిచేస్తానని పోలీసులు చెప్పారు.
ఇవీ చదవండి