కరోనా విషయంలో ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. వ్యాక్సిన్ కొనుగోలు మొదలు.. పంపిణీ, కరోనా చికిత్స, మౌలిక వసతులు ఏర్పాటు, మెడికల్ మాఫియా దందాను అరికట్టడం వరకు అన్నింటిలోనూ ఘోరంగా విఫలమైందన్నారు. తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు అవాస్తవాలతో ప్రకటనలు ఇస్తోందన్నారు. చాలా రాష్ట్రాలు ముందు చూపుతో వివిధ కంపెనీలకు అడ్వాన్సులు చెల్లించి వ్యాక్సిన్ను కొనుగోలు చేశాయని... వైకాపా ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల మొదటి డోస్ వేసిన వారికి రెండో డోస్ దొరకట్లేదన్నారు.
ఇదీ చదవండి: రహదారి విస్తరణ పనులను అడ్డుకున్న వ్యాపారులు