ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపాలో ఇరు వర్గాల మధ్య విభేదాలు పరిషత్ ఎన్నికల్లో మరోసారి బహిర్గత మైంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు సోదరుడు రవీంద్ర.. తాళ్లూరు మండలం శివరాంపురంలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని.. మద్దిశెట్టి వ్యతిరేక వర్గం ఆరోపించింది. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన మద్దిశెట్టి వ్యతిరేక వర్గానికి చెందిన వారు.. రవీంద్ర కారుపై రాళ్లు రువ్వారు. తమపై దాడికి దిగినవారిపై చర్యలు తీసుకోవాలంటూ.. రవీంద్ర వర్గీయులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
ఇవీ చూడండి...