ETV Bharat / state

ప్రభుత్వ స్థలం... ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జా - ప్రభుత్వ స్థలాల కబ్జా వార్తలు

రెవెన్యూ రికార్డుల ప్రకారం అవి ప్రభుత్వ భూములే. కానీ అక్రమార్కులకు కాసులవర్షం కురిపించే కల్పతరువులు. ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు చటుక్కున వాలుతూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పరిసరాల్లో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.

government land
ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం
author img

By

Published : May 18, 2021, 1:16 PM IST

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో 70 సెంట్ల ప్రభుత్వ భూమి కొన్నేళ్లుగా ఓ వ్యక్తి ఆధీనంలో ఉంది. దానిని ఇటీవల విక్రయించడంతో కొనుగోలుదారు నిర్మాణాన్ని చేపట్టారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే త్రిపురాంతకానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ వాగు మూలమలుపు వద్ద కొందరు వ్యక్తులు అర ఎకరా భూమిని ఆక్రమించి మట్టి తోలి చదును చేశారు. ప్రాంతాన్ని బట్టి అడుగు విలువ రూ.లక్ష, ఆ పైచిలుకు చెబుతూ అమ్మకాలు చేస్తున్నారు.
చుక్కల భూములదీ అదే దారి: మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ రహదారిని ఆనుకుని చుక్కల భూములను కొనుగోలు చేసి వెంచర్లు వేస్తున్నారు. రిజిస్టర్‌ కాదని తెలిసి కూడా లావాదేవీలు చేస్తున్నారు. ఎన్నెస్పీ మిగులు భూములనూ విక్రయించేందుకు పన్నాగం పన్నుతున్నారు.

ఆదాయానికి గండి: త్రిపురాంతకంతో పాటు గణపవరం, మేడపి, రాజుపాలెం, వెల్లంపల్లి, బీఆర్‌ కూడలి, కేశినేనిపల్లి తదితర ప్రాంతాల్లో పలు అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీలకు రూపాయి కూడా చెల్లించడం లేదు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలు, ప్లాట్లుగా లేఅవుట్‌ వేయడానికి తొలుత భూమి మార్పిడికి రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాలి. భూమి విలువలో 10 శాతాన్ని చెల్లించాలి. తర్వాత స్థానిక పంచాయతీకి దరఖాస్తు చేసుకోవాలి. లేఅవుట్‌ ఫీజు కింద ఎకరాకు రూ.4,050, సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.8,100 చెల్లించాలి. తర్వాత దరఖాస్తును జిల్లా టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌(డీటీపీసీ) అధికారులకు పంపిస్తారు. అక్కడ రూ.5 వేలు చెల్లిస్తే తాత్కాలిక అనుమతి ఇచ్చిన తర్వాత లేఅవుట్‌ వేయాలి. 33 అడుగుల అంతర్గత, 40 అడుగుల ప్రధాన రహదారి వేయాలి. పది శాతం భూమిని సామాజిక అవసరాలకు కేటాయించాలి. అప్పుడే తుది అనుమతి వస్తుంది. ఇటువంటివేవీ చేయకుండానే లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలుగా విక్రయిస్తున్న పరిస్థితి.

అడ్డుకొని బోర్డులు ఏర్పాటుచేస్తున్నాం
ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు తెలిసిన వెంటనే అడ్డుకుని బోర్డులు ఏర్పాటుచేస్తున్నాం. ఎక్కడైనా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా, విక్రయించినా సమాచారం అందిస్తే తక్షణం చర్యలు తీసుకుంటాం. చాలాచోట్ల లేఅవుట్లు కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు మినహా మిగతావారు అనుమతులు పొందిన దాఖలాలు లేవు. పంచాయతీ కార్యదర్శులు వాటిని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది.
- వి.కిరణ్, తహసీల్దార్, త్రిపురాంతకం

ఇదీ చదవండి: ప్రభుత్వం కేటాయించినా.. అందని సరకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.