ETV Bharat / state

తరాలనాటి చెట్టు అని.. కదపక.. చెరపక.. కాపాడాడు!

ప్రకృతితో మమేకమే మనిషి జీవనం. జీవరాశుల ఉన్నతికి.. మనుగడకు చెట్టే ప్రధాన కారణం. అలాంటి వృక్షాల పట్ల నిర్లక్ష్యం, నిర్లిప్తత నెలకొంది. సొంత స్థలంలో ఇళ్లు కట్టుకోవాలంటే అక్కడున్న చెట్టూచేమను తొలగిస్తున్నాం. కానీ ఓ ఇంటి యజమాని గొప్పతనం వింటే మీరు ఆశ్చర్యపోతారు. తన ఆస్తి కంటే ప్రకృతి సంపదే ముఖ్యమని భావించాడు.పెరటిలో తరాలుగా పెరుగుతున్న చెట్టును కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. చెట్టుకు హాని కలిగించకుండా ఇంటిని నిర్మించుకున్నాడు. అసలేంటి ఈ కథ.. చదువుదామా..!

neem tree in house
తరములనాటి చెట్టు అని
author img

By

Published : Feb 21, 2021, 6:07 PM IST

Updated : Feb 22, 2021, 6:08 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం జమ్మిచెట్టు వీధిలో వెన్నలకంటి రామచంద్రరావు అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయన పూర్వీకులు అక్కడే పెంకుటిల్లులో జీవించేవారు. వారి పెరట్లో వేప చెట్టు ఉండేది. రామచంద్రరావు ఇంజినీరుగా పని చేస్తున్నారు. పాత పెంకుటిల్లు స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టాలని అనుకున్నారు. కొలతలు తీసుకున్నారు. ఇంటి నిర్మాణానికి అడ్డుగా వేప చెట్టు ఉంది. దాన్ని తొలగిస్తే తప్ప నిర్మాణానికి వీలు కాదు. ఇక ఆ వృక్షాన్ని తొలగించాల్సిందేనని అంతా భావించారు. కానీ తాతల కాలంనుంచి ఉన్న చెట్టును నరికేయాలంటే రామచంద్రరావుకు మనసు ఒప్పలేదు.

వేప చెట్టును అమ్మవారిలా..

వేప చెట్టును అమ్మవారిలా రామచంద్రరావు భావించారు. అడ్డుగా పెరిగిన కొమ్మలు మాత్రమే తొలగించి.. దానికి అనుగుణంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. నిర్మాణం మధ్యలో చెట్టు ఉండిపోయింది. తనకున్న ఇంజినీరింగ్‌ పరిఙ్ఞానంతో ఎక్కడా ఎలాంటి పగుళ్లు, లీకేజీలు లేకుండా స్లాబ్‌లు నిర్మాణం చేపట్టారు. మూడంతస్థుల మేడ కట్టినా.. చెట్టు ప్రాణాలతో ఉంది. కాండం, వేళ్లు ఇంటి మధ్యలో ఉన్నాయి. చెట్టు ఇంకా పచ్చగా.. యథావిధంగా బతికేస్తోంది. ఇంట్లో భాగమైపోయింది.

ఇబ్బందులేమీ లేవు..

రామచంద్రరావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. తన ఇంటిని అద్దెకిచ్చారు. అందులో ఉన్నవారు సైతం వేప చెట్టును అమ్మవారిగా భావించి పూజలు చేస్తున్నారు. చెట్టువల్ల ఇబ్బందులేమీ తలెత్తలేదని తెలిపారు. వేసవిలో ఇంటిలోపల చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటోందని పేర్కొన్నారు. చెట్టును దైవ సమానంగా భావించి పరిరక్షిస్తుండటం..దాన్ని కాపాడుతూ ఇంటినిర్మాణం చేపట్టడం అందరినీ ఆలోచింపజేస్తోంది.

అదృష్టంగా భావిస్తున్నాం..

"దేశ ఔనత్యాన్ని తెలిపేది మన ఆచార వ్యవహారాలు. వాటి వల్లే మనం అగ్రగామిగా నిలిచాం. పూర్వం ఇళ్ల పెరట్లో రావి, వేప, ఉసిరి వంటి ఔషధ గుణాలున్న చెట్లను పెంచేవారు. ఈ ఇంట్లో కూడా వేపచెట్టు పెంచారు. అది ఇప్పుడు మహావృక్షంగా ఎదిగింది. మేము ఈ ఇంట్లో పదేళ్లుగా అద్దెకుంటున్నాం. పాత ఇల్లు కూల్చాలని.. నూతన నిర్మాణం చేపట్టాలని ఈ ఇంటి యజమాని వెన్నలకంటి రామచంద్రరావు భావించారు. అందుకు చెట్టు నరకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ రోజు ఆయన కలలోకి అమ్మవారు వచ్చారట. వృక్షం నరకకుండా ఇల్లుకట్టుకోమని చెప్పారట. ఈ సంఘటన వేప చెట్టులో అమ్మవారు ఉన్నారనటానికి తార్కాణం. వృత్తి పరంగా వెన్నలకంటి రామచంద్రరావు సివిల్ ఇంజనీర్​ కావడంతో వేపచెట్టును నరకకుండా మూడంతస్థుల ఇల్లు నిర్మించారు. చెట్టుకు చుక్కనీరు పోయకున్నా.. ఏడాదికి మూడు సార్లు కాయాలు, పిందెలు, పూత వస్తాయి. పెద్ద వృద్ధ మాతగా ఈ వృక్షాన్నికొలుస్తున్నాం. గౌరీదేవిగా పూజిస్తున్నాం. వృక్షం మొదలును సరస్వతి దేవి, మధ్యలో లక్ష్మీదేవి, అగ్రతలంలో పార్వతీదేవిగా కొలుస్తున్నాం. ఈ వేప చెట్టు నీడలో ఉండటం.. దీనికి పూజ చేయటం అదృష్టంగా భావిస్తున్నాం."

"కొమ్మలు మాత్రమే కొట్టేసి దాని చుట్టూ మూడంతస్థుల ఇంటిని నిర్మించారు. వర్షం కురిసి నీళ్లు నిలిచినా.. పైనుంచి చుక్క నీరు కూడా ఇంటిలోకి చేరదు. చెట్టు వల్ల ఎలాంటి ఇబ్బందులు మాకు కలగలేదు."

-ఇంటిలో అద్దెకున్న దంపతులు

ఇదీ చదవండి:

వాగ్వాదానికి దారితీసిన.. విద్యార్ధుల ఓటింగ్!

Last Updated : Feb 22, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.