ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు - prakasam district latest news

ప్రకాశం జిల్లాలో రానున్న మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు 6 మున్సిపాలిటీలకు ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వివరించారు. 14వ తేదీన కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు

municipal elections preparations in prakasam district
ప్రకాశంజిల్లాలో మున్సిపల్ ఎన్నికల సన్నాహాలు
author img

By

Published : Feb 23, 2021, 7:07 PM IST

ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలకు, గిద్దలూరు, అద్దంకి, కనిగిరి, చీమకుర్తి నగరపంచాయతీలకు ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. చీరాలలోని సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో 9వ తేదీన ఎన్నికల సామగ్రి పంపిణీ, 10 వతేది పోలింగ్ అనంతరం అదే కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. 14వ తేదీన కౌంటింగ్ ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు.

చీరాల:

వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అందరూ సహకరించాలని ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్ పీ.ఎసయ్య కోరారు. చీరాలలోని మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్​లో 33 వార్డులకు బరిలో నిలిచిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులను నిర్వహించేందుకు బూత్ లెవల్ ఆఫీసర్స్​గా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మున్సిపల్ ఉద్యోగులను నియమించమన్నారు.

అద్దంకి:

అద్దంకి నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అద్దంకి పట్టణంలోని 1,2,3,18,19,20 వార్డుల కౌన్సిలర్, కార్యకర్తలు, ప్రజలతో వైకాపా నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అద్దంకి నగర పంచాయతీ విజయం కోసం కృషి చేయాలని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కృష్ణ చైతన్య పిలుపు నిచ్చారు.

ఇదీ చదవండి

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. కలెక్టరేట్​ ఎదుట నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.