ETV Bharat / state

పరిషత్ ఎన్నికలు: జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు - పరిషత్ ఎన్నికలకు మార్కాపురంలో చకచకా ఏర్పాట్లు

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, తర్లుపాడు, కొనకమిట్లలో అధిక ఎంపీటీసీ స్థానాలను వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కొనసాగించాలని కోర్టు తీర్పు చెప్పిన మేరకు.. మార్కాపురంలో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలివెళ్తున్నారు.

parishad elections arragements in markapuram, markaopuram elections staff going to polling stations
మార్కాపురంలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్న ఎన్నికల సిబ్బంది
author img

By

Published : Apr 7, 2021, 4:31 PM IST

Updated : Apr 7, 2021, 10:46 PM IST

పరిషత్ ఎన్నికల కోసం మద్దిపాడు, కొత్తపట్నం ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన.. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ పోల భాస్కర్ పరిశీలించారు. హైకోర్టు తాజాగా స్పష్టత ఇవ్వడంతో.. వేగంగా ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. 99 శాతం ఎన్నికల సిబ్బంది హాజరుకాగా.. సామాగ్రితో పాటు వారిని తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మండలానికొక రిటర్నింగ్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారులను పంపామని వెల్లడించారు. ఒంగోలు నగరంతో పాటు కందుకూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి, చీరాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

మార్కాపురంలో ఏర్పాట్లిలా...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు యథాతథంగా కొనసాగుతుండటంతో.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలింగ్​కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. హైకోర్టు తీర్పు కోసం ఇప్పటివరకు సిబ్బంది వేచి చూశారు. న్యాయస్థానం ఎన్నికల నిర్వహణకు పచ్చ జెండా ఊపిన మేరకు.. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లేందుకు ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మార్కాపురం మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. జడ్పీటీసీ ఎన్నికలకు తెదేపా దూరంగా ఉన్న కారణంగా.. వైకాపా, కాంగ్రెస్, సీపీఎంల మధ్య పోటీ కొనసాగనుంది. తర్లుపాడులోనూ 10 ఎంపీటీసీ స్థానాలను వైకాపా ఇప్పటికే సొంతం చేసుకోగా.. జడ్పీటీసీ స్థానం కోసం వైకాపా, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొనకనమిట్ల మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకుగాను 13 వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానంలోనూ పోటీలో ఉన్న తెదేపా ఎన్నికలకు దూరంగా ఉంది. ఇక వైకాపా, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ కొనసాగనుంది. పొదిలిలో నూతనంగా ఏర్పడిన నగర పంచాయతీ వ్యవహారం కోర్టులో ఉండటంతో ఎన్నికలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి:

రైతులను ఇబ్బంది పెట్టొద్దు: కలెక్టర్ పోల భాస్కర్

Last Updated : Apr 7, 2021, 10:46 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.