వైకాపా అధికారంలోని వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు ఉద్యోగ భర్తీకి సంబంధించి వార్షిక క్యాలెండర్ విడుదల చేయలేదని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఎన్జీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తక్షణమే గ్రూప్-1, 2, 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 15 వేల డీఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఉపాధ్యాయులకు సంబంధించిన 11వ వేతన సంఘం సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, సీపీఎస్ రద్దును ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు సక్రమంగా విడుదల చేయనందున నిరుద్యోగుల వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెవీవీ యూటీఎఫ్ నాయకులు కుర్ర రామారావు, విజయ్ సూరిబాబు, కె. వీరాంజనేయులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పిటిషన్ కొట్టి వేసిన ధర్మాసనం... యథావిధిగా స్థానిక ఎన్నికలు