ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో రెండో విడత రేషన్ పంపిణీ వెంటనే ప్రారంభించాలని.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. యర్రగొండపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీడీఓ, తహశీల్దార్లతో కరోనా వైరస్, నిత్యావసర సరకుల పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. కొవిడ్ ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిలు, ప్రత్యేక అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించే విధంగా చూడాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలని సూచించారు.
ఇవీ చదవండి: