ETV Bharat / state

గుర్రంపై రేషన్.. ఆలోచన అదిరెన్

author img

By

Published : Apr 18, 2020, 1:57 PM IST

విశాఖ మన్యం మారుమూల ప్రాంతాలకు రేషన్ సరకులు చేరవేయడం కత్తిమీద సాములాంటింది. సరైన రహదారులు లేక నడవడమే కష్టతరంగా ఉంటుంది. అలాంటిది రేషన్ పంపిణీ చేయడం అంత తేలికేం కాదు. ఇక్కడే తెలివిగా ఆలోచించాడు ఆ వాలంటీర్. గుర్రంపై సరుకులు తీసుకెళ్లి ఇంటింటికీ అందజేశాడు. కరోనా వేళ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

volunteer distribute ration with the help of horses at kinnerlova vizag agency
గుర్రంపై రేషన్ సరకులు తీసుకెళ్తున్న వాలంటీర్

విశాఖ మన్యం హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ కిన్నెర్లోవ ప్రాంతం కొండపై ఉంటుంది. అక్కడికి వెళ్లేందుకు సరైన రహదారి లేదు. లాక్ డౌన్ కారణంగా రేషన్ తీసుకునేందుకు ఆ ప్రాంతం వారు రాలేదు. ఆ బాధ్యత అక్కడ వాలంటీరుగా పనిచేస్తున్న కిల్లో సీమన్నపై పడింది. రహదారి సదుపాయం లేకపోయినా, రవాణా సౌకర్యాలు కానరాకపోయినా.. తన బాధ్యత నెరవేర్చాలనుకున్నాడు. గుర్రంపై రేషన్ సరకులు తీసుకెళ్లి ఇంటింటికీ అందించాడు. రెండు గుర్రాలపై గ్రామానికి అవసరమైన రేషన్ తీసుకెళ్లి పంపిణీ చేశాడు. కరోనా వేళ తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చిన వాలంటీర్​ని గ్రామస్థులు అభినందించారు.

ఇవీ చదవండి:

అరటి గొర్రె పాలు.. ఆశలు మట్టిపాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.