Masala Vada in Tirumala : తిరుమలలో నిత్య అన్నదానంలో భాగంగా లక్ష నుంచి 2లక్షల మంది భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్నాహ్నం, రాత్రి భోజనం అందిస్తుంటారు. 1985 ఏప్రిల్ 6న తొలిసారిగా అన్నదానం నిరాటంకంగా కొనసాగుతూ అన్నదాన ప్రసాదంలా మారిపోయింది. తాజాగా టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మరో కొత్త వంటకాన్ని చేర్చారు. సోమవారం నుంచి భక్తులకు దీనిని వడ్డించడం ప్రారంభించారు. తొలిరోజు ఐదువేల మసాలా వడలను ప్రయోగాత్మకంగా వడ్డించారు. మరో వారం పాటు ఇదే స్థాయిలో కొనసాగిస్తూ ఫలితాల అనంతరం పూర్తిస్థాయిలో అమలు చేస్తారని సమాచారం. అన్నప్రసాదాల నాణ్యత, మసాలా వడ అందించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుమలలో అన్నదానం చేయండిలా - స్వయంగా మీరే వడ్డించొచ్చు
ముక్కోటి వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 6.83 లక్షల మందికి శ్రీవారిని దర్శించుకున్నారు. వారందరికీ వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించింది. పదిరోజుల్లో స్వామి వారికి హుండీ ఆదాయం రూ.34.43 కోట్లు సమకూరగా 1,13,132 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. పండుగ సెలవుల నేపథ్యంలో రద్దీ పెరగ్గా తాజాగా కాస్త తగ్గుముఖం పట్టింది. శ్రీవారి సర్వదర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య సాధారణంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20 సాయంత్రానికి శ్రీవారి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని రెండు షెడ్లలో నిండిపోయారు. వీరికి 15 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 20న (సోమవారం) 83వేల 806 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 23వేల 352మంది తలనీలాలు సమర్పించారు. రూ.3.59కోట్ల హుండీ ఆదాయం లభించిందని టీటీడీ వెల్లడించింది. రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 6గంటల సమయం పట్టిందని టీటీడీ తెలిపింది.
ఈ నెల 19న (ఆదివారం) 70వేల 826 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22వేల 624మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా 3.68కోట్ల ఆదాయం సమకూరింది.
శ్రీవారిని దర్శించుకున్న 2.25కోట్ల భక్తులు - హుండీ ఆదాయం ఎంతో తెలిస్తే షాక్!
తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్ - కావాల్సినన్ని లడ్డూలు - ఎప్పటినుంచో తెలుసా?