ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని నర్సాయపాలెం, అమనిగూడిపాడు గ్రామాలకు చెందిన కూలీలు బత్తాయి కాయల కోత కోసం తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా, హాలియకు కూలి పనుల కోసం వెళ్లారు. కోతలు ముగించుకొని తిరిగి రాత్రి సమయంలో స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా...యర్రగొండపాలెం సమీపంలో ఉన్న మెట్టబోడు తండా వద్ద గేదెను తప్పించబోయి లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా...మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
ఇదీ చూడండి: ఒక్క సానిటరీ ప్యాడ్‌ను 120సార్లు వాడొచ్చు!