Lock to secretariat: అద్దె చెల్లించకపోవడంతో పెద్దదోర్నాల 4వ సచివాలయానికి భవన యజమాని మంగళవారం తాళం వేశారు. ప్రకాశం జిల్లాలో ఈ మేజర్ పంచాయతీ పరిధి అయినముక్కలలోని అద్దె భవనంలో సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు. నెలకు రూ.5 వేల చొప్పున 14 నెలలకు సంబంధించి రూ.70 వేల అద్దె చెల్లించలేదు. కొన్ని నెలలుగా సిబ్బందిని కోరుతున్నా.. ప్రభుత్వం నుంచి బిల్లు రాలేదని చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేక యజమాని మంగళవారం భవనానికి తాళం వేయడంతో సిబ్బంది రైతు భరోసా కేంద్రంలోకి వెళ్లి విధులు నిర్వర్తించారు. పంచాయతీ కార్యదర్శి రామిరెడ్డిని వివరణ కోరగా.. గతంలో కొంత అద్దె చెల్లించామని, త్వరలో మిగిలింది చెల్లిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: