మద్యరహిత రాష్ట్రమే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వల్లరెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. నవరత్నాలలో భాగంగా రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.