ప్రకాశం జిల్లా కొమ్మలపాడు గ్రామంలో అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల గ్రామస్థులు ఆందోళన చేశారు. గ్రామంలో మొత్తం 61 ఇళ్ల స్థలాలకు అధికారులు ప్లాట్లు వేశారు. వీటిని గ్రామంలో పేదలకు ఇచ్చేందుకు లాటరీ పద్ధతి నిర్వహించారు. ముందుగా 43 పేర్లు తహసీల్దార్ ఖరారు చేశారు. కాని ఆఖరి జాబితాలో కొత్తగా 5 పేర్లు చేరాయి. ఆగ్రహం చెందిన గ్రామస్థులు... అనర్హులను జాబితాలో ఎందుకు చేర్చారో చెప్పాలంటూ వీఆర్వోను నిలదీశారు. మండల తహసీల్దార్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :