NBK: దగ్గుబాటి ఇంట.. గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య - నందమూరి బాలకృష్ణ వార్తలు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా కారంచేడు వచ్చిన ఆయన.. సరదగా గడిపారు. బాలయ్యతోపాటు ఆయన కుమారుడు మోక్షజ్ఞ గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వచ్చారు.