ప్రకాశం జిల్లాలో పలుచోట్ల వర్షాలు ముంచెత్తుతున్నాయి. మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒంగోలు పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన కాలువల్లో మురుగు నీరు పొంగి రహదారుల మీదకు వచ్చి ప్రవహిస్తోంది. కర్నూలు రోడ్డులో వర్షపు నీరు మోకాలు లోతులో ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వర్షంతో పాటు చలిగాలులు కూడా వీస్తుండటంతో జనం గజగజ వణుకుతున్నారు. దీనికితోడు కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
ఇదీ చదవండి:
మత్స్యకారులకే తెలియని వింత చేప... వాడరేవు తీరానికి కొట్టుకు వచ్చింది!