ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్ సి.హెచ్ ప్రసాద్ అనుమానస్పదంగా మృతి చెందాడు. మరణించిన వ్యక్తి చీరాలలో ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రోజూ ఒంగోలు నుంచి చీరాల వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో రైలులో ఒంగోలు వెళ్తున్నాడు.
అమ్మనబ్రోలు వద్ద రైలు ఆగినప్పుడు దిగి..మళ్లీ కదులుతున్నప్పుడు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: