ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో ఆస్ట్రేలియన్ ఆట... అదేంటో తెలుసా... - ప్రకాశం జిల్లాలో ఆస్ట్రేలియన్ ఆట తాజా వార్తలు

ఆ యువకుడికి ఆటలంటే ప్రాణం. అందరిలా కాకుండా... ప్రత్యేకంగా ఉండాలని భావించాడు. విదేశాలకే పరిమితమైన క్రీడను ఎంచుకున్నాడు. నిరంతరం శ్రమించి పట్టు సాధించాడు. స్థానిక యువతకు చేరువ చేయాలని నిర్ణయించుకున్నాడు. చదువుకుంటూనే... ఈ విభాగంలో రాష్ట్రానికి సమన్వయ కర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇంతకు ఎవరా కుర్రాడు..? అతను ఆడే ఆట ఏంటి..?

footy-game-in-prakasam
author img

By

Published : Nov 20, 2019, 4:26 PM IST

ప్రకాశం జిల్లాలో ఆస్ట్రేలియన్ ఆట... నేర్పిస్తున్నాడు మహేంద్రుడు...

అప్పటివరకు మహా నగరాలకే పరిమితమైన రగ్బీ... రాజమౌళి తీసిన 'సై' సినిమాతో పట్టణ, గ్రామీణ ప్రాంత యువతకు చేరువైంది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నాయుడుపల్లికి చెందిన మహేంద్ర రెడ్డి... రగ్బీపై మక్కువ పెంచుకున్నాడు. కళాశాలలో ఉండగానే ఆ ఆటలో అడుగులేసి... ప్రతిభ చూపాడు.

రగ్బీ ఆడుతున్న సమయంలోనే... ఇదే ఆటను పోలిన 'ఫుటీ'పై ఆసక్తి పెంచుకున్నాడు మహేంద్రరెడ్డి. ఆస్ట్రేలియా సహా వివిధదేశాల్లో ఆదరణ ఉన్న ఈ క్రీడను... రాష్ట్ర యువతకు పరిచయం చేయాలనుకున్నాడు. తొలుత విదేశీ కోచ్‌ల సాయంతో ఫుటీలో నైపు‌ణ్యం సాధించాడు.

ఫుట్‌బాల్‌నే సంక్షిప్తంగా ఫుటీ అని పిలుస్తారు. ఆస్ట్రేలియాలో క్రికెట్‌తో సమానంగా దీనికి గుర్తింపు ఉంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. ఇటీవల రెక్లింక్‌ ఇండియా ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని జైపూర్‌ విశ్వవిద్యాలయం ఆల్‌ ఇండియా ఫుటీ-2019 కార్నివాల్ జరిగింది. దీంట్లో పాల్గొన్న మహేంద్రరెడ్డి... ఆస్ట్రేలియా కో ఫౌండర్‌ పీటర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ కోఆర్డినేటర్‌గా నియామాక పత్రం అందుకున్నాడు.

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న మహేంద్రరెడ్డి... ఫుటీ క్రీడను రాష్ట్రంలో అభివృద్ది చేసే బాధ్యతలు తీసుకున్నాడు. ప్రతి జిల్లాలో క్రీడా బృందాల్ని ఏర్పాటు చేసి... వారికి తర్ఫీదు ఇస్తున్నాడు. ఏపీ రగ్బీ సీనియర్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించిన మహేంద్రరెడ్డి... విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. చండీగఢ్‌ విశ్వవిద్యాలయ జట్టుకు మేనేజర్‌గానూ సేవలందించాడు.

ఫుటీ క్రీడాభివృద్ధికి మహేంద్రరెడ్డి చేస్తున్న కృషిని క్రీడాకారులు, క్రీడాభిమానులు అభినందిస్తున్నారు. చదువుతో పాటు క్రీడాకారుడిగా, శిక్షకుడిగా రాణిస్తున్న మహేంద్ర రెడ్డి... ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

రాత్రిళ్లు ఒకేచోట ఆహారం.. గుంటూరులో ఫుడ్‌కోర్టులు ప్రారంభం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.