ప్రకాశం జిల్లా చీమకుర్తి వద్ద గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ అగ్నికి (Fire Accident in lorry) ఆహుతైంది. చీమకుర్తి గ్రానైట్ క్వారీ నుంచి కృష్ణపట్నం పోర్టుకు గ్రానైట్ బండను తరలిస్తుండగా లారీలో ఒక్కసారి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తమై లారీ నుంచి దూకేయటంతో ప్రాణనష్టం తప్పంది. అగ్ని ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి