ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తంగిరాలపల్లి ఎస్సీ కాలనీలో... దారుణం జరిగింది. ఆవేశంలో తండ్రిని చంపేశాడు కుమారుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాలనీకి చెందిన సుబ్బయ్య, మరియదాసు తండ్రీకుమారులు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం మరియదాసు ఇంట్లోనే ఉంటున్నాడు.
లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి బాలేక ఏదో ఒక పని చేసుకోవాల్సిందిగా కుమారుడిని తండ్రి సుబ్బయ్య మందలించాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. కోపంలో రోకలిబండతో తండ్రి తలమీద కొట్టాడు మరియదాసు. తీవ్రంగా గాయపడిన సుబ్బయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఇవీ చదవండి: