ETV Bharat / state

నీటికుంటలో పడి బాలుడు మృతి - ప్రకాశం జిల్లా నేర వార్తలు

ప్రకాశం జిల్లా కార్తీకపురంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి విద్యార్థి మృతి చెందాడు. అతని తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

Boy death falling into water in kanigiri prakasam district
నీటికుంటలో పడి బాలుడు మృతి
author img

By

Published : May 3, 2020, 3:24 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కార్తీకపురం గ్రామానికి చెందిన వెంగళరావు పదో తరగతి చదువుతున్నాడు. లాక్​డౌన్ కారణంగా పాఠశాలలకు సెలవులివ్వడంతో ఇంటి వద్దే ఉంటూ గేదెలను మేపుతూ పొలానికి వెళ్లాడు. వెంగళరావుకు దాహం వేస్తుండడంతో నీళ్లు తాగేందుకు సమీపంలో ఉన్న కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి, శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఇదీచదవండి.

చేనేత కార్మికులకు సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.