IRCTC Tour Package : శివరాత్రి వేళ శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలనుకునే వారికి IRCTC చక్కని అవకాశం కల్పిస్తోంది. నాలుగు రోజుల యాత్రలో భాగంగా శ్రీశైలంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక ప్రాంతాల దర్శనం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిలిం సిటీ సందర్శన అవకాశం కూడా ఉంది.
"శివరాత్రి వేళ శ్రీశైలం" - యాదాద్రినీ సందర్శించేలా IRCTC సూపర్ ప్యాకేజీ!
బడ్జెట్ ధరలోనే హైదరాబాద్, శ్రీశైలం, రామోజీ ఫిలిం సిటీ సందర్శనకు టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చినట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలో భాగంగానే శ్రీశ్రైలం కూడా కవర్ చేసే అవకాశాన్ని కల్పించింది. ''Highlights of Hyderabad With Srisailam' పేరుతో హైదరాబాద్ నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ కొత్త టూర్ ప్యాకేజీలో భాగంగా ముందుగా హైదరాబాద్ లోని చారిత్రక ప్రాంతాలతో పాటు రామోజీ ఫిలిం సిటీని సందర్శిస్తారు.
- మొదటి రోజు : హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లో పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. అదే రోజు చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం చూసిన తర్వాత తిరిగి రాత్రి కల్లా హోటల్‌కు చేరుకుంటారు. డిన్నర్, రాత్రి బస అక్కడే ఉంటుంది.
- రెండో రోజు : హైదరాబాద్ నుంచి శ్రీశైలం యాత్ర మొదలవుతుంది. తెల్లవారుజామున 5గంటలకే హోటల్ నుంచి బయల్దేరుతారు. దాదాపు 5 గంటల ఈ ప్రయాణంలో టిఫిన్ ఖర్చులు ఎవరికి వారే చెల్లించుకోవాలి. శ్రీశైలం చేరుకున్నాక మల్లికార్జునుడిని దర్శించుకుని అప్పటికి సమయం ఉంటే సమీపంలోని ఇతర ప్రాంతాలను సందర్శించే వీలుంటుంది. రాత్రి కల్లా హైదరాబాద్ చేరుకుని డిన్నర్, రాత్రి బస హోటల్లోనే ఉంటుంది.
- మూడో రోజు : హోటల్లోనే ఉదయం అల్పాహారం చేశాక రామోజీ ఫిలిం సిటీకి బయల్దేరుతారు. రోజంతా అక్కడే గడిపాక రాత్రికి హోటల్‌కు చేరుకుని డిన్నర్, రాత్రి బస అక్కడే ఉంటుంది.
- నాలుగో రోజు : టూర్లో చివరి రోజు. ఉదయం అల్పాహారం ముగించుకున్నాక లగేజీ సర్దుకుని బిర్లామందిర్ దర్శనం చేసుకుంటారు. తర్వాత గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టోంబ్స్ చూసి తిరిగి సాయంత్రానికి మీరు వెళ్లాలనుకున్న హెదరాబాద్/ సికింద్రాబాద్/కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగబెడతారు.
హైదరాబాద్ - శ్రీశైలం ట్రిప్ ధరలు సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 36270, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19070, ట్రిపుల్ రూ. 14570గా నిర్ణయించారు. 5-11 ఏళ్ల చిన్నారులకు రూ.9590 ఉంటుంది.
ప్యాకేజీ పేరు Highlights of Hyderabad With Srisailam కాగా, ఇందులో 3 డిన్నర్లు, 2 బ్రేక్ ఫాస్ట్‌లు ఉంటాయి. ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టు లేదా ఆదిత్య హోమ్ టెల్లో ఏసీ అకామిడేషన్ ఉంటుంది. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం, యాత్రలో భాగంగా ఏసీ వాహనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటాయి.
టూరిజం ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి లాగిన్ కావాలి. దీంతో పాటు మరెన్నో ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. Hyderabad With Srisailam ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాల కోసం 8287932229 / 8287932228 నెంబర్లను సంప్రదించవచ్చు.
తెల్లవారుజామున 'గుడిస'కు పర్యాటకులు క్యూ - మర్చిపోలేని జ్ఞాపకాలు అందిస్తున్న హిల్‌స్టేషన్
'రైతులకు గుడ్‌న్యూస్' పీఎం కిసాన్ నిధుల విడుదలకు సిద్ధం - జాబితాలో పేరుందో లేదో ఇలా తెలుసుకోండి!