property dispute: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో ఆస్తి వివాదం.. రెండు నిండు ప్రాణాలు బలితీసుకుంది. గత కొన్ని రోజులుగా ఆస్తి కోసం కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం తండ్రి, కొడుకులు మరోసారి గొడవపడ్డారు. తండ్రి సీతారామయ్యను.. కుమారుడు శంకర్రావు ఇనుప రాడ్డుతో దాడి చేసి హతమార్చాడు.
అనంతరం ఇంట్లో ఉరి వేసుకొని.. కుమారుడు శంకర్రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: కట్టుకున్నవాడే కడతేర్చాడు.. కారణం అదేనా..?