ETV Bharat / state

ఇక్కడి రైతులకు భూమిపోతే బువ్వలేదు..! - Prakasham District Latest news

ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో భారీ పరిశ్రమలు నెలకొల్పడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. వీటికి ప్రభుత్వం కూడా భూములు ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. పరిశ్రమలు రావడాన్ని స్వాగతిస్తున్న స్థానిక రైతులు.. తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు భూములు ఇవ్వబోమని పేర్కొంటున్నారు.

Farmers demands over Industries Establishment at Donakonda
ఇక్కడి రైతులకు భూమిపోతే బువ్వలేదు..!
author img

By

Published : Nov 1, 2020, 7:11 PM IST

దొనకొండ ప్రాంతంలో మళ్లీ భారీ పరిశ్రమల దృష్టిపడటం, ఈక్రమంలో కావాల్సిన భూములు ఇచ్చేందుకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేయడం, ఆమేరకు కొన్నింటికి ఆమోదముద్ర వేయడం లాంటి కార్యకలాపాలతో.. దొనకొండ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక సందడి కొనసాగుతోంది. పరిశ్రమలు వచ్చి వేగంగా అక్కడ అభివృద్ధి జరిగితే తమకు కూడా ప్రయోజనమే అన్న బావనలో స్థానిక ప్రజలు ఉన్నారు. వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభంకానున్న 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రాజెక్టుకు భూసేకరణ విషయంలో బాధిత గ్రామాల ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

ప్రభుత్వం ఎంతసేపూ భూముల సేకరణ విషయం పైనే దృష్టిసారించిందని, తమ గోడు వినిపించకోవడంలేదన్న ఆక్రందన వారిలో కనిపిస్తోంది. ఇదివరకు ఇస్తామన్న కౌలు ఏమాత్రం సరిపోదని, ఆవిధంగా భూములు తీసుకుంటే బువ్వకూడ లేని పరిస్థితులతో అల్లాడాల్సి వస్తుందని అక్కడి రైతులు వాపోతున్నారు. రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రయోజనాలు కలిగేలా ప్రభుత్వం చూడాలని వారువేడుకుంటున్నారు.

4995 ఎకరాలలో...
దొనకొండ ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంట్​కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆమేరకు ఇప్పటికే దాదాపు 2400 ఏకరాల భూములను కూడా కేటాయించింది. మొత్తం 4995 ఎకరాలు అంచనా ఉండగా మిగిలిన భూములను సేకరించే పనిలో పడింది. అయితే అక్కడ రైతులు పంటలు పండించుకునే భూములు సేకరించాల్సి ఉండటంతో అధికారులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తే జిల్లా రైతులందరికీ ప్రయోజనమే. కానీ ఏళ్లుగా ఇక్కడ సాగుచేసుకుంటున్న రైతులు మాత్రం భూములు కోల్పోతే తమకు జీవనో పాధి పోతుందని, వలసలు పోవాల్సి వస్తుందని, చివరకు బువ్వ కూడా లేని పరిస్థితులు వస్తాయని ఆవేదన చెందుతున్నారు. అందుకే కొందరు రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని, ఇవ్వాలంటే తమ డిమాండ్లను మన్నించి ఆమేరకు ప్రయోజనాలు కల్పించాలని మరికొందరు కోరుతున్నారు.

ఎకరాకు రూ.25 వేలా...
ఈ ఏడాది జూలైలో నిర్వహించిన గ్రామసభల్లో రైతుల అభిప్రాయాలను అధికారులు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సమక్షంలో రైతులకు నచ్చజెప్పారు. ప్రభుత్వం 9 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇచ్చే క్రమంలో భాగంగా దొనకొండ మండలంలో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని, ప్రాజెక్టు కట్టడం తథ్యమని, జీవనోపాధికి నష్టం కలుగుతుందన్న ఆభిప్రాయాలు చెప్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అలానే పట్టాలు ఉన్న వారికి ఎకరాకు రూ.25 వేలు ఏడాదికి కౌలు ఇస్తామని, ఈ సారి పంటలు వేయకూడదని చెప్పారు.

తర్వాత పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం రైతులు అక్కడ కంది, మిరప, పత్తి, ఆముదం లాంటి పంటలు వేసుకున్నారు. ఈ క్రమంలో రుద్రసముద్రం, మంగినపూడి, భూమనపల్లిలో కలిపి పట్టాభూములు, సాగులో ఉన్నది. కొండగుట్ట ప్రాంతం మొత్తం కలిపి దాదాపు 4900 ఎకరాల భూసేకరణకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీంతో రైతులు అనేక సందేహాలతో సతమతం అవుతున్నారు. ముందుగా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, వారి ప్రయోజనాలు వివరించి ముందుకు సాగితే మంచిందన్న ఆభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పనుల్లేకుండా పోతాయి...
ఏళ్లుగా పండించుకుంటున్న భూములు ఇలా ఇచ్చేస్తే మాకు పనులుండవు. పట్టాలు లేక పోయినా చాలా మంది సాగు భూమిగా మార్చుకుని పంటలు పండించుకుంటున్నారు. ఇప్పుడు మూడు గ్రామాల్లో భూములు తీసుకుంటే ఏళ్లుగా సాగు చేసుకుని బతుకుతున్నవారిపై ప్రభావం పడుతుంది. భూములు లేవని ఎవరూ రుణం కూడా ఇవ్వరు. ఈ ప్రాజెక్టుతో వెయ్యి కుటుంబాలు ఆనాదలై పనులేక రోడ్డున పడతారు. వలసపోవాల్సి వస్తుంది. రైతుల వద్ద భూములు తీసుకుని పనులు లేకుండా చేయడం అన్యాయం.- పెద్ద బంగారయ్య, రుద్రసముద్రం

సాగుతో ఏడాదికి లక్ష వస్తుంది...

భూ సేకరణ ప్రాంతంలో 200 విద్యుత్తు పరివర్తకాలు, 1000 వరకు వ్యవసాయ బోర్లు ఉన్నాయి. రైతులు మిర్చి, కంది తదితర పంటలు ఎక్కువ సాగు చేస్తుంటారు. ఏడాదిలో ఏ పంటలు వేసిన ఎకరాకు లక్ష వరకు వస్తుంది. అలాంటిది ఎకరాకు రూ.25వేలు కౌలు అ అంటే నష్టమే. ఈసారి కూడా రైతులు అప్పులు చేసి సాగుచేశారు. ఇప్పుడు భూమి సేకరిస్తే పంటతో పాటు ఆర్థికంగా నష్టపోతాం. మా తర్వాత పిల్లలకు ఎకరా భూమి ఉండదు. ప్రభుత్వం ఏమిచేసినా మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాలి.-చెన్నుబోయిన ఎర్ర గాలెయ్య, రుద్రసముద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.