అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించ తలపెట్టిన ఆందోళనల వార్తా సేకరణలో ఉన్న ఈటీవీ-భారత్ న్యూస్ కంట్రిబ్యూటర్ వీరగంధం సందీప్ కుమార్(32) గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. ఒంగోలులోని ఫ్లైఓవర్ వద్ద తెదేపా నేతలను పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయాన్ని గమనించిన స్థానికులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సందీప్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన కొప్పొలులోని నివాసానికి తరలించారు. మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్, ఉగ్రనరసింహారెడ్డి పలువురు పాత్రికేయులు సందర్శించి నివాళులర్పించారు.
ఇవీ చదవండి...భద్రాద్రి తెప్పోత్సవంలో అపశ్రుతి.. ఒకరు గల్లంతు