గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈనాడు క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషదాయకమని ప్రకాశం జిల్లా చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి అన్నారు. చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామసుబ్బారెడ్డి బ్యాటింగ్ చేయగా... కళాశాల కరస్పాండెంట్ రామకృష్ణ బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓటమి గెలుపునకు నాంది అని జయరామ సుబ్బారెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడం కోసం ఈనాడు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. మొదటి మ్యాచ్ ట్రిబుల్ ఐటీ ఒంగోలు, కనిగిరి మహిళా జట్ల మధ్య పోటీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.
ఇవీ చూడండి..మంట గలిసిన మానవత్వం.. ఆరుబయటే మహిళ మృతదేహం