ETV Bharat / state

Water problem in Kanigiri: 'కనిగిరి' గొంతెండుతోంది.. కాసిన్ని నీళ్లిచ్చేవాళ్లు లేరా?! - ప్రకాశం జిల్లా సమాచారం

కనిగిరి నగర పంచాయతీలో తీవ్ర నీటి సమస్య ఉంది. వారం రోజులకు ఒకసారి నీళ్ల ట్యాంక్​ వస్తుంది. ఆ నీళ్లు ఎటూ సరిపోట్లేదని స్థానికులు వాపోయారు.

తాగునీటి సమస్య
తాగునీటి సమస్య
author img

By

Published : Aug 13, 2021, 7:27 PM IST

కనిగిరి నగర పంచాయతీలో తాగునీటి సమస్య

ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలో రోజులు, నెలలు కాదు.. ఏడాది పొడవునా.. నీటి కొరతే. వర్షాకాలమైనా ఆ ప్రాంతంలో తాగునీటికి ఎద్దడే. ఇంత ఇబ్బంది పడుతున్నా.. తమ సమస్యను పట్టించుకునే అధికారులు, నాయకులు లేరని నగర పంచాయతీలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని రజక వీధి, టకారిపాలెం, దేవాంగనగర్, అర్బన్ కాలనీ, కాశిరెడ్డి నగర్, బొగ్గుల గొందికాలనీల లాంటి శివారు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆ ప్రాంతాల్లో.. కనీసం వారానికి ఓ సారి ట్యాంకర్ తో నీటిని సరఫరా చేస్తున్నారు. అది ఏ మాత్రం సరిపోవట్లేవని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో తమ ప్రాంతంలో వర్షాలు లేక.. భూగర్భజలాలు అడుగంటాయని.. బోర్లలో ఎక్కడా చుక్క నీరు రాక గుక్కెడు నీరు కోసం నానాకష్టాలు పడాల్సివస్తోందని వాపోయారు.

ఇక.. నీటి కొరత తాళలేక పలు కుటుంబాలు వలసపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోని కారణంగా.. రోజు రోజుకు తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికైనా.. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

CSR COLLEGE: ఎయిడెడ్‌ సంస్థల మూసివేత.. ప్రశ్నార్థకంగా శర్మ కళాశాల భవిష్యత్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.