ETV Bharat / state

'రైతు భరోసా కేంద్రాలు ఆధునిక దేవాలయాలు' - ప్రకాశం జిల్లా వార్తలు

ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జిల్లా స్థాయి వ్యవసాయశాఖ సలహా మండి సమావేశం జరిగింది. కలెక్టర్ పోలా భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్ పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందని మంత్రి బాలినేని చెప్పారు.

'రైతు భరోసా కేంద్రాలు ఆధునిక దేవాలయాలు'
'రైతు భరోసా కేంద్రాలు ఆధునిక దేవాలయాలు'
author img

By

Published : Aug 20, 2020, 11:22 PM IST

వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రైతు పక్షపాతిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు. జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ సలహా మండలి తొలి సమావేశం గురువారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ పోల భాస్కర్ అధ్యక్షతన జరిగింది.

వాణిజ్య పంటల కొనుగోలు

రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందించాలని ఆయన మంత్రి బాలినేని ఆదేశించారు. రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సలహా మండలి నియమించి క్షేత్రస్థాయి నుంచి వార్షిక ప్రణాళిక సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు పంటను కొనుగోలు చేసి రైతన్నకు భరోసా కల్పిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతోందన్నారు. అయినప్పటికి జిల్లాలో వరి పంట సాగుకు అధికారికంగా ప్రకటించలేని పరిస్థితి ఉందన్నారు. జలవనరుల శాఖ మంత్రి మాట్లాడి వరి సాగుపై త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

వ్యవసాయం లాభసాటిగా..

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఆధునిక దేవాలయాలుగా మారాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఆర్.బి.కె.లు నెలకొల్పి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందివ్వడం శుభపరిణామన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారిస్తూ లాభసాటి వ్యవసాయం కోసం అనేక సంస్థాగత మార్పులను ముఖ్యమంత్రి తెచ్చారన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మున్ముందు రోజుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వం యోచిస్తుందని ఆయన చెప్పారు.

రావాల్సిన నీటి వాటా తెచ్చుకుంటాం

జిల్లాకు 53 టీఎమ్ సీల సాగర్ నీరు రావాల్సివుందని, వాటిపై నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని అధికారులకు మంత్రి సురేశ్ సూచించారు. సీఎం జగన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి జిల్లాకు అవసరమైన తాగు, సాగు నీటి వాటాను తెచ్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

85/3 మైలురాయి వద్ద భద్రత పెంచాలని, 3,300 క్యూసెక్కుల నీరు ప్రతిరోజు జిల్లాలో వచ్చేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికతో పనిచేయాలన్నారు. వరి పంటకు స్థిరీకరణ నిధి అమలుచేయాలన్నారు. విపత్తు సమయంలో మార్కెటింగ్ శాఖ ద్వారా పొగాకు పంట కొనుగోలు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో జేసీ వెంకట మురళీ , జేడీ శ్రీరామూర్తి, ఎమ్మెల్యే మహిధర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ టీ.వీ.కట్టమణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.